ఇండోనేషియాలో గురువారం ఉదయం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని USGS వెల్లడించింది. భూకంపం అనంతరం ప్రమాదకరమైన సునామీ తరంగాల అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:48 గంటలకు, మలుక్కా సముద్రంలో సుమారు 35 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ కేంద్రం టెర్నేట్ అనే చిన్న దీవి సమీపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హవాయిలోని Pacific Tsunami Warning Center ప్రకారం, భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరప్రాంతాల్లో ప్రమాదకర సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇండోనేషియా వాతావరణ, భౌగోళిక సంస్థ (BMKG) కూడా సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.
ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానిక విపత్తు నిర్వహణ సంస్థలు, సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు ఇంకా పూర్తి అంచనాలు ప్రకటించలేదు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని బిటుంగ్ నగరంలో భూకంపం బలంగా అనిపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుడు మార్టెన్ మండాగి మాట్లాడుతూ…భూకంపం చాలా బలంగా అనిపించింది.. మేమంతా వెంటనే బయటకు వచ్చాం అని చెప్పారు.
ఇండోనేషియా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు జరుగుతుంటాయి. 2022లో వెస్ట్ జావాలో 5.6 తీవ్రత భూకంపంలో 600 మందికి పైగా మరణించారు.2018లో సులవేసి భూకంపం, సునామీలో 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.2004లో ఇండియన్ ఓషన్ సునామీలో 2.3 లక్షల మందికి పైగా మరణించారు.
ఇండోనేషియాలో గురువారం ఉదయం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని USGS వెల్లడించింది. భూకంపం అనంతరం ప్రమాదకరమైన సునామీ తరంగాల అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:48 గంటలకు, మలుక్కా సముద్రంలో సుమారు 35 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ కేంద్రం టెర్నేట్ అనే చిన్న దీవి సమీపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

