Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ వార్.ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఇరాన్ వార్.ట్రంప్‌కు ఎదురుదెబ్బ

మెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అధికారికంగా సైనిక చర్యకు అనుమతి ఇచ్చే వరకు…ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డెమొక్రాట్ల నేతృత్వంలోని యూఎస్ ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది.

ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక అధికారాలను నియంత్రించేందుకు దిగువ సభ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. యుద్ధ నిర్వహణలో ట్రంప్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. రిపబ్లికన్ ప్రతినిధులు థామస్ మాస్సీ, బ్రయాన్ ఫిట్జ్‌పాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్సన్‌లు తమ పార్టీ నిర్ణయాన్ని కాదని ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో స్వల్ప మెజారిటీతో పాస్ అయింది. ఇరాన్ విషయంలో ట్రంప్ యుద్ధ అధికారాలను పరిమితం చేయడానికి డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలకు…ఇప్పుడు రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది.

జనవరి 6, 2021న యూఎస్ కాపిటల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులకు చెల్లింపులు చేయడానికి ఉపయోగపడవచ్చు అనే ఆందోళనలతో…అధ్యక్షుడు ప్రతిపాదించిన 1.8 బిలియన్ డాలర్ల నిధిని సెనెట్ రిపబ్లికన్లు తిరస్కరించారు. అలాగే ట్రంప్ బాల్‌రూమ్ భద్రతకు కేటాయించిన నిధులను కూడా సెనెట్ రిపబ్లికన్లు రద్దు చేశారు.

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అధికారికంగా సైనిక చర్యకు అనుమతి ఇచ్చే వరకు…ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డెమొక్రాట్ల నేతృత్వంలోని యూఎస్ ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక అధికారాలను నియంత్రించేందుకు దిగువ సభ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. యుద్ధ నిర్వహణలో ట్రంప్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu