Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ 59 ఏళ్ల నిరీక్షణకు తెర!

కాంగ్రెస్ 59 ఏళ్ల నిరీక్షణకు తెర!

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది.

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు దక్కడం గత 59 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంతగానో ఎదురుచూసిన ఒక చారిత్రాత్మక రోజని ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు చేరబోతున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఇది మాకు అత్యంత చారిత్రాత్మకమైన సందర్భం. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలో చేరుతోంది అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మంత్రి పదవులు చేపట్టబోతున్న ఇద్దరు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన వేణుగోపాల్.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక, సంక్షేమ పాలన అందించడానికి వీరు కృషి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

దశాబ్దాల నాటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్న కాంగ్రెస్.. డీఎంకే (DMK) తో బంధాన్ని తెంచుకుని, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తో చేతులు కలిపింది. తద్వారా రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు బలమైన పునాది వేసింది.

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు దక్కడం గత 59 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu