ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. కేరళం సీఎంగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సతీశన్ చూపిన తెగువ, పార్టీ శ్రేణుల్లో ఆయనకు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కేరళలోని 102 మంది యూడీఎఫ్ (UDF) ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సతీశన్ వైపు మొగ్గు చూపారు. పార్టీ పరిశీలకులు అందించిన నివేదిక కూడా ఆయనకే అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి రేసులో సీనియర్ నేతలు రమేష్ చెన్నితల మరియు కె.సి. వేణుగోపాల్ పేర్లు బలంగా వినిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే సతీశన్ వంటి నాయకుడే సరైన వ్యక్తని అధిష్టానం భావించింది.
పారవూర్ నియోజకవర్గం నుండి వరుసగా ఆరోసారి విజయం సాధించిన సతీశన్, కాంగ్రెస్ పార్టీలో వివాదరహితుడిగా మరియు సమర్థవంతమైన వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.