Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మరియు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ తో ఈరోజు సమావేశమయ్యారు.

నందినగర్ లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు మరియు వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించడమైనది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, మరియు విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. గతంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కేటీఆర్ గారు ఈ అంశంలో అనేక అంశాలపై చర్చించారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, మరియు ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై… తెలంగాణ మరియు ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన మైత్రిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఈ చర్చలు సాగాయి. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ భేటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరియు సాంస్కృతిక బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొనడం జరిగింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మరియు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ తో ఈరోజు సమావేశమయ్యారు. నందినగర్ లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు మరియు వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించడమైనది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu