Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR:మఫ్టీ పోలీసులా? కాంగ్రెస్ గుండాలా?

KTR:మఫ్టీ పోలీసులా? కాంగ్రెస్ గుండాలా?

హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే తన పీఏ, పీఆర్వోలపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్టంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గుండాయిజం నడుస్తోందని మండిపడ్డారు.

పోలీసు విచారణ నిమిత్తం వచ్చిన తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపలే దాదాపు 15 మంది మాస్కులు ధరించిన దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. స్టేషన్ లోపలికి వచ్చి దాడికి యత్నించిన ఆ 15 మంది అసలు కాంగ్రెస్ గుండాలా లేక మఫ్టీలో వచ్చిన పోలీసులా అనేది స్పష్టం కావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘటన జరిగిన తర్వాత ఆ దుండగులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకాడటం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడానికి వెళ్లినప్పుడు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలనే పోలీసులు అరెస్టూ చేశారని ఆయన గుర్తుచేశారు.

తాము ఉన్న పోలీస్ స్టేషన్‌పైకి కూడా కాంగ్రెస్ గుండాలు వచ్చి దాడికి యత్నించారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్ల లోపలే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన కేటీఆర్, ఈ ఘటనపై పటిష్ట విచారణ జరిపించాలని, సైఫాబాద్ పిఎస్ సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే భద్రపరచాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే తన పీఏ, పీఆర్వోలపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గుండాయిజం నడుస్తోందని మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu