Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ ఎమ్మెల్యే కొమ్మడి మృతి..కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్యే కొమ్మడి మృతి..కేసీఆర్ సంతాపం

తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.రాజకీయాల్లో నిరాడంబరతకు, నీతి నిజాయితీలకు నిదర్శనంగా నిలిచిన ప్రజల మనిషి నర్సింహారెడ్డి అని, వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.

భూదానోద్యమంలో తన వందలాది ఎకరాలను పేదలకు పంచిన నర్సింహా రెడ్డి.. 1969 లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొని, మూసీ పరిరక్షణ కోసం, తెలంగాణకు గోదావరి నదీ జలాల కోసం కృషి చేశారని కొనియాడారు.

శోకతప్తులైన కొమ్మిడి నర్సింహారెడ్డి గారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.రాజకీయాల్లో నిరాడంబరతకు, నీతి నిజాయితీలకు నిదర్శనంగా నిలిచిన ప్రజల మనిషి నర్సింహారెడ్డి అని, వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu