మాల్డాలో న్యాయాధికారులపై జరిగిన ఘెరావ్ ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను "ముందుగానే ప్రణాళికతో చేసిన చర్య"గా పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ … మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు చేస్తున్న న్యాయాధికారులను అడ్డుకోవడం "కోర్టు అధికారాన్ని సవాల్ చేసే ధైర్యమైన ప్రయత్నం" అని వ్యాఖ్యానించారు.
ఇది న్యాయాధికారులను నిరుత్సాహపరచడానికి, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి చేసిన ప్రణాళికాబద్ధ చర్య అని తెలిపారు. సాయంత్రం 3:30 గంటలకు ఘెరావ్ ప్రారంభమైనట్లు కోర్టు వివరించింది. వెంటనే రిజిస్ట్రార్ జనరల్ పరిపాలన అధికారులకు సమాచారం ఇచ్చినా, గంటల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు గమనించింది.
రాత్రి 8:30 వరకు చర్యలు లేవు..తర్వాత హోం సెక్రటరీ, DGPలను సంప్రదించారు,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కాన్ఫరెన్స్ కాల్ జరిగింది.హామీ ఇచ్చినా, స్పష్టమైన చర్యలు తీసుకోలేదు అని అభిప్రాయపడింది. ఈ ఘటనలో జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వైఖరిపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
జిల్లా కలెక్టర్ (DM) సంఘటన స్థలానికి రాలేదు,పోలీస్ సూపరింటెండెంట్ కూడా స్పందించలేదు. చివరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా DGP, హోం సెక్రటరీలను సంప్రదించాల్సి వచ్చినట్లు కోర్టు పేర్కొంది. చీఫ్ సెక్రటరీ, DGP, హోం సెక్రటరీల ప్రవర్తనపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ అంశాన్ని రాజకీయంగా మలుస్తున్నారన్న అంశంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయంగా మాట్లాడుతున్నారు అని పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్‌కు తెలిపింది సుప్రీం. ఎవరు ఈ ఘటనకు కారణమో మాకు తెలుసు. నేను రాత్రి 2 గంటల వరకు పరిస్థితిని గమనించాను అని CJI తెలిపారు.
మాల్డాలో న్యాయాధికారులపై జరిగిన ఘెరావ్ ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను "ముందుగానే ప్రణాళికతో చేసిన చర్య"గా పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.

