Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లేషియాలోని 'మాట్రేడ్' (MATRADE) ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 6, 2026న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బిఆర్ఎస్ (BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మలేషియా చేరుకున్నారు.ఈ వేడుకలను బిఆర్ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ ఉత్సవాలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మహేష్ బిగాల వేడుకలు జరగనున్న కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ మౌలిక సదుపాయాలు, పార్కింగ్ వసతులు మరియు ఇతర ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం నిర్వహణ కమిటీతో సమావేశమై ఏర్పాట్ల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమీక్షా సమావేశంలో బిఆర్ఎస్ మలేషియా, మైటా (MYTA) ముఖ్య ప్రతినిధులు టి. మారుతి కూర్మ, తిరుపతి, సందీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, అనిల్, జ్యోతి, మోనా, పూర్ణచందర్ రావు, దీపికతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తుది ఏర్పాట్లపై మహేష్ బిగాల వారికి పలు సూచనలు చేస్తూ, ఇప్పటివరకు చేసిన ఏర్పాట్ల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

2025లో డల్లాస్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల తర్వాత, భారతదేశం వెలుపల ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న రెండవ అతిపెద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇదే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, విశిష్ట సాంస్కృతిక వారసత్వం మరియు సాధించిన అభివృద్ధి విజయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ మలేషియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ వేడుకలకు ప్రవాస తెలంగాణీయులు భారీ సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మలేషియాలోని 'మాట్రేడ్' (MATRADE) ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 6, 2026న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బిఆర్ఎస్ (BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మలేషియా చేరుకున్నారు.ఈ వేడుకలను బిఆర్ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu