వాహనదారులకు చమురు సంస్థలు మళ్లీ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతుండటంతో.. కేవలం ఒకే వారంలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి.
తాజా సవరణతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల నుండి 96 పైసల వరకు పెరిగింది. కేవలం మూడు రోజుల క్రితమే దేశవ్యాప్తంగా లీటరుకు ₹3 చొప్పున భారీగా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తాజా ధరలు మరియు పెరిగిన విలువల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.98.64 ,ముంబైలో రూ.107.59 ,కోల్‌కతాలో రూ.109.70,చెన్నైలో రూ.₹104.49గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో డీజీల్ ధరలు రూ. 91.58,ముంబైలో రూ.94.08,కోల్‌కతాలో రూ.96.0,చెన్నైలో రూ.₹96.11గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా షాక్‌లు మరియు ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో కూడా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ (LPG) లభ్యతకు ఎక్కడా కొరత రాకుండా చూసుకున్నాం. 2022 నుండి అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, బలమైన విధానాలు, సమర్థవంతమైన సరఫరా నిర్వహణ కారణంగా దేశంలో ఇంధన ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
వాహనదారులకు చమురు సంస్థలు మళ్లీ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతుండటంతో.. కేవలం ఒకే వారంలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి.

