పశ్చిమ బెంగాల్‌లోని సాల్ట్ లేక్ స్టేడియంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక శిల్పాన్ని తొలగించాలని సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో తీసుకుంటున్న వరుస దూకుడు నిర్ణయాలలో భాగంగా ఈ చర్య చేపట్టింది. ఈ శిల్పాన్ని 2017లో జరిగిన ఫిఫా (FIFA) అండర్-17 వరల్డ్ కప్‌నకు ముందు సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ వెలుపల ఏర్పాటు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేగవంతమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిజైన్ చేసిన వివాదాస్పద శిల్పాన్ని తొలగించాలని నిర్ణయించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిసిత్ ప్రామాణిక్ ఈ శిల్పం తొలగింపును అధికారికంగా ప్రకటించారు. సాల్ట్ లేక్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ శిల్పంలో.. ఒక ఫుట్‌బాల్ ఆటగాడి రెండు కాళ్లు బంతిని తాకుతున్నట్లు ఉండి, నడుము పైభాగంలో కేవలం ఒక ఫుట్‌బాల్ మాత్రమే ఉంటుంది. ఒక వినూత్న శైలిని ప్రతిబింబించేలా దీనిని అప్పట్లో రూపొందించారు.
మమతా బెనర్జీ రూపొందించిన ఈ నిర్మాణాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ.. దీనిని త్వరలోనే కూల్చివేస్తామని చెప్పారు. నడుము భాగం వద్ద కాళ్లు కట్ చేసి, దానిపై ఫుట్‌బాల్ పెట్టిన ఈ విగ్రహం చాలా వికారంగా ఉంది…దీనికి ఎలాంటి అర్థం లేదు. ఇది చూడటానికి అస్సలు బాగుండలేదు. ఎలాంటి అర్థం లేని ఇటువంటి వింత ఆకృతిని మేము స్టేడియం వద్ద ఉంచదలచుకోలేదు, అందుకే దీనిని తొలగిస్తున్నాం అని ప్రామాణిక్ విలేకరులకు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని సాల్ట్ లేక్ స్టేడియంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక శిల్పాన్ని తొలగించాలని సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో తీసుకుంటున్న వరుస దూకుడు నిర్ణయాలలో భాగంగా ఈ చర్య చేపట్టింది. ఈ శిల్పాన్ని 2017లో జరిగిన ఫిఫా (FIFA) అండర్-17 వరల్డ్ కప్‌నకు ముందు సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ వెలుపల ఏర్పాటు చేశారు.

