Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొక్కలు నాటిన కేటీఆర్.

మొక్కలు నాటిన కేటీఆర్.

మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు.

అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియ తిరిగారు. తండ్రి కేసీఆర్ సహా తన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదినం సందర్భంగా కేటీఆర్ మొక్కను నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ కుమారుడు హిమాన్షు కూతురు రియాన్షి ఇంకా కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.కాగా… ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న యువత కు మద్దతుగా, వారి పైన జరుగుతున్న నిర్బంధాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా..తన పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండుతో, బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నీట్ లీకేజీ బాధిత విద్యార్థులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ అక్కడినుండి నేరుగా ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.

మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu