Dailyhunt
మూసీ ప్రాజెక్టు NGT కేసు ..డిస్మిస్ అవాస్తవం

మూసీ ప్రాజెక్టు NGT కేసు ..డిస్మిస్ అవాస్తవం

మూసీ ప్రాజెక్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో (NGT)లో దాఖలైన కేసు డిస్మిస్ అయ్యిందనే వార్తలు అసత్యమని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.

ఈ విషయంపై మీడియా ప్రచారం చేస్తున్న కథనాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కేసు 'డిస్మిస్' అయిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం తప్పుదారి పట్టించడమేనని కార్తీక్ రెడ్డి అన్నారు. డిస్మిసల్ అంటే కేసును పూర్తిగా కొట్టివేయడం. కానీ 'డిస్పోజల్' అంటే మనం లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేసును ముగించడం అని ఆయన వివరించారు.

కొన్ని మీడియా సంస్థలు సీఎంవో నుండి వచ్చిన లీకుల ఆధారంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆయన విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కేసును డిస్మిస్ అయ్యిందని చెప్పడం సరైంది కాదని అన్నారు. మూసీ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన సాంకేతిక అంశాలు ఇంకా స్పష్టత పొందలేదని కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ స్థాయిలు ఖరారు చేయకుండానే ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. అవసరమైన అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయని చెప్పుతూ తాను NGTలో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఈ పిటిషన్‌పై స్పందించిన NGT న్యాయమూర్తులు, ప్రభుత్వం పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిందని గుర్తు చేశారు. "ఒకవేళ ఆ మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తే మళ్లీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు" అని సూచించినట్లు తెలిపారు.

మా పిటిషన్‌ను NGT డిస్పోజ్ చేసింది. కానీ డిస్మిస్ చేయలేదు అని కార్తీక్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.

మూసీ ప్రాజెక్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో (NGT)లో దాఖలైన కేసు డిస్మిస్ అయ్యిందనే వార్తలు అసత్యమని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై మీడియా ప్రచారం చేస్తున్న కథనాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu