ఐదు దేశాల యూరప్ పర్యటనలో నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ మరియు నార్వేలోని భారత రాయబారి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ గౌరవార్థం ఓస్లో విమానాశ్రయంలో నార్వే సాయుధ దళాలు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ప్రదర్శించాయి.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 3వ భారత్-నార్డిక్ సదస్సులో పాల్గొననున్నారు. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, మరియు ఐస్లాండ్ దేశాల అధినేతలతో కూడిన ఈ సదస్సులో డిజిటల్ ఆవిష్కరణ , ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
పర్యటనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతిప్రతినిధి సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో నాలుగో దేశంగా ప్రధాని నరేంద్ర మోదీ నార్వేలోని ఓస్లోలో అడుగుపెట్టారు. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, 3వ భారత్-నార్డిక్ సదస్సుకు వేదిక కానుంది అని పేర్కొన్నారు.
ఓస్లో చేరుకున్న అనంతరం ప్రధాని మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య బ్లూ ఎకానమీ (సముద్ర వనరుల అభివృద్ధి), పునరుత్పాదక ఇంధనం, సాంకేతికత, మరియు పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అలాగే, నార్వే రాజు హెరాల్డ్ Vను కూడా ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
ఐదు దేశాల యూరప్ పర్యటనలో నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ మరియు నార్వేలోని భారత రాయబారి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ గౌరవార్థం ఓస్లో విమానాశ్రయంలో నార్వే సాయుధ దళాలు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ప్రదర్శించాయి.

