Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET నిరసనలు..లిక్కర్ షాపుల క్లోజ్!

NEET నిరసనలు..లిక్కర్ షాపుల క్లోజ్!

జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల దృష్ట్యా, వారాంతం (వీకెండ్) పూర్తయ్యే వరకు ఢిల్లీ అంతటా మద్యం దుకాణాలను సాధారణ సమయం కంటే రెండు గంటల ముందే-అంటే రాత్రి 10 గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకే మూసివేస్తారని వర్గాలు తెలిపాయి.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మద్యం షాపులను త్వరగా మూసివేయడంతో కొనుగోలుదారులు వెనుతిరగాల్సి వచ్చింది. ఆ సంఘటన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల వల్ల నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. వీకెండ్ ముగిసే వరకు షాపులు రాత్రి 8 గంటలకే మూసివేయబడతాయి అని ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

NEET పేపర్ లీక్‌పై సెంట్రల్ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా నిరసనలు హోరెత్తుతున్నాయి.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) బ్యానర్‌పై జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన విద్యార్థులు, ఈ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పేపర్ లీక్ వల్లే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. కాగా జులై 20న CJP నిర్వహించిన 'పార్లమెంట్ మార్చ్' తీవ్ర హింసాత్మకంగా మారడంతో పలువురు నిరసనకారులు, కొందరు పోలీసు సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే.

జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల దృష్ట్యా, వారాంతం (వీకెండ్) పూర్తయ్యే వరకు ఢిల్లీ అంతటా మద్యం దుకాణాలను సాధారణ సమయం కంటే రెండు గంటల ముందే-అంటే రాత్రి 10 గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకే మూసివేస్తారని వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu