Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET-UG:రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు

NEET-UG:రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ కొత్త తేదీని అధికారికంగా ప్రకటించింది. గతంలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రద్దు కావడంతో, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా ప్రకటన ప్రకారం, జూన్ 21, 2026 (ఆదివారం) నాడు నీట్ పునఃపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరియు తల్లిదండ్రులు కేవలం అధికారిక ఎన్టీఏ (NTA) సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.

రీ-నీట్ పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మే 2026 పరీక్ష సమయంలో నమోదు చేసుకున్న డేటా, అభ్యర్థిత్వం మరియు ఎంచుకున్న పరీక్షా కేంద్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.

ఫీజు చెల్లించనక్కర్లేదు: పునఃపరీక్ష కోసం అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, గతంలో అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ (తిరిగి చెల్లింపు) చేస్తామని, ఎన్టీఏ తన అంతర్గత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహిస్తుందని 'X' వేదికగా స్పష్టం చేసింది.

రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత neet.nta.nic.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ కొత్త తేదీని అధికారికంగా ప్రకటించింది. గతంలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రద్దు కావడంతో, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా ప్రకటన ప్రకారం, జూన్ 21, 2026 (ఆదివారం) నాడు నీట్ పునఃపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరియు తల్లిదండ్రులు కేవలం అధికారిక ఎన్టీఏ (NTA) సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu