Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నీట్' రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం!

'నీట్' రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం!

నీట్-యుజి (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రకటించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం బీహార్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నాం. దీనితో పాటు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో పరీక్ష రాసే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తాగునీరు, సత్తు (ఆహార పదార్థాలు) వంటి వసతులు కల్పించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్రంలోని మఠాలు, దేవాలయాలను మరియు స్వచ్ఛంద సంస్థలను (NGOs) కోరుతున్నాను అని పేర్కొన్నారు.

మరోవైపు, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్.. నీట్-యుజి 2526 వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఇచ్చిన వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అంశం చాలా తీవ్రమైనదని, దీనిపై కేవలం ప్రకటనలు చేసి సరిపెట్టలేమని అన్నారు. వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని, ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

నీట్-యుజి (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu