Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్టీ బలోపేతమే లక్ష్యం: కేటీఆర్

పార్టీ బలోపేతమే లక్ష్యం: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. శనివారం నంది నగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

రానున్న ఎన్నికలు, పార్టీ సంస్థాగత మార్పులపై ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.

త్వరలో చేపట్టబోయే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను నిర్మించాలని, చురుకైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని, జాబితాలో అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించాలని పార్టీ నేతలకు సూచించారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీ, మున్సిపల్) ఘనవిజయం సాధించిన పార్టీ ప్రతినిధులను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని ఆయన నేతలకు సూచించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలని స్పష్టం చేశారు.

మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తర్వాత రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి ఉన్న పట్టును నిలబెట్టుకుంటూ, మెజారిటీ కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ ఆదేశాలతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. శనివారం నంది నగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రానున్న ఎన్నికలు, పార్టీ సంస్థాగత మార్పులపై ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu