Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంత్‌పై అశ్విన్‌ అసంతృప్తి!

పంత్‌పై అశ్విన్‌ అసంతృప్తి!

రిషబ్ పంత్ కొట్టిన షాట్ల ఎంపికపై భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు టెస్టుల సిరీస్‌లో పంత్ 168 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తగినట్లు మార్పులు చేసుకోవాలని సూచించారు.

అలాగే పంత్‌కు మాత్రమే ప్రత్యేక మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నించిన అశ్విన్ అలాంటి మద్దతును ఇతర యువ ప్రతిభావంతులకు కూడా అందించాలని స్పష్టం చేశారు.

శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టులో గాయంతో బాధపడుతూనే రిషబ్ పంత్ 65 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ అశ్విన్ ఆయన ఆట తీరుపై సంతృప్తి చెందలేదు. పంత్ ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడని ఎప్పుడూ ఒకే శైలిని అనుసరించకుండా తన అనుభవాన్ని ఉపయోగించి ఆటను మెరుగుపరుచుకోవాలని విశ్లేషించారు.

రెండు టెస్టుల సిరీస్‌లో పంత్ 168 పరుగులు చేయడం అభినందనీయమే అయినప్పటికీ, క్లిష్ట సమయాల్లో ఆయన షాట్ల ఎంపిక విధానం అశ్విన్‌ను కలవరపరిచింది. ఒత్తిడి ఉన్న సమయంలో పంత్ తగినంత పరిణతి చూపించడం లేదని, 'తరానికి ఒక్కడే లభించే ఆటగాడు' అనే చర్చను ఇకనైనా పక్కనబెట్టి, పంత్ బాధ్యతాయుతంగా ఆడాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు. తన ఇమేజ్‌కి తగ్గట్లు కాకుండా, మ్యాచ్ పరిస్థితి డిమాండ్ చేసినట్లుగా ఆడాలని సూచించారు.

రిషబ్ పంత్ నుండి నా అంచనాలు ఇప్పటివరకు నెరవేరలేదు. నన్ను క్షమించండి. సోనాల్ దినుష స్ట్రైక్ రేట్ పెంచుకున్నాడు కానీ తేడా ఏమిటంటే పంత్ అధిక ప్రమాదకర షాట్లు ఆడడమే. మ్యాచ్ మీ చేతిలో ఉన్నప్పుడు 'పంత్ ఆడే శైలి అంతే' అని చెప్పడం సమంజసం కాదు. జట్టుకు ఆ సమయంలో ఏమి అవసరమో దానిబట్టి ఆడటమే ముఖ్యం" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

పంత్ సామర్థ్యాన్ని తాను శంకించడం లేదని కేవలం వివిధ పరిస్థితులను ఆయన ఎలా ఎదుర్కొంటున్నాడనే దానిపైనే మాట్లాడతానని అశ్విన్ స్పష్టం చేశారు. మ్యాచ్ గెలుపోటముల మధ్య ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల గురించే నేను మాట్లాడుతున్నాను. ఆటగాడిగా పంత్ అంటే నాకు ఇష్టమే కానీ టెస్టుల్లో మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం చాలా ముఖ్యం అని తెలిపారు. పంత్ అరుదైన ప్రతిభావంతుడు అనే నెపంతో ఆయనకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలనే భావనను అశ్విన్ తప్పుపట్టారు. అలాంటి మద్దతును యశస్వి జైస్వాల్ వంటి ఇతర యువ ఆటగాళ్లకు కూడా అందించాలని డిమాండ్ చేశారు.

రిషబ్ పంత్ కొట్టిన షాట్ల ఎంపికపై భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు టెస్టుల సిరీస్‌లో పంత్ 168 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తగినట్లు మార్పులు చేసుకోవాలని సూచించారు. అలాగే పంత్‌కు మాత్రమే ప్రత్యేక మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నించిన అశ్విన్ అలాంటి మద్దతును ఇతర యువ ప్రతిభావంతులకు కూడా అందించాలని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu