Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ ఫ్యాన్ పనికి అనసూయకు షాక్‌..

పవన్ ఫ్యాన్ పనికి అనసూయకు షాక్‌..

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల విడుదలై రికార్డు సృష్టిస్తోంది. అయితే వకీల్ సాబ్ సినిమా ద్వారా పవన్ ను మళ్లీ తెరపై చూసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పైగా సినిమా సూపర్ అంటూ అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో వారి జోష్ మామూలుగా లేదు. అయితే, సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మేనియాను అంటే ఏంటో చూపిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లో తెరపై అభిమాని ఒకరు రక్తంతో పవన్ పేరు రాయడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో పట్ల ప్రముఖ నటి, యాంకర్ అనసూయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చూడ్డానికి భీతిగొలిపేలా ఉందని వ్యాఖ్యానించారు. "ఇదేం అభిమానం.

తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించరా? బాధ్యతగా వ్యవహరించాలి. అయినా అభిమానం ప్రదర్శించుకోవడానికి చాలా మార్గాలున్నాయి" అని హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu