దేశ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఢిల్లీ నివాసంలో అస్సాం పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య ఫిర్యాదు నేపథ్యంలో చోటుచేసుకుంది.
అస్సాం పోలీసుల బృందం… ఢిల్లీ పోలీసుల సహాయంతో, న్యూఢిల్లీ లోని పవన్ ఖేరా నివాసానికి చేరుకుని విచారణ చేపట్టింది. ఈ చర్యకు ముందు, సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రింకి భుయాన్ శర్మ గువాహటి పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇటీవల పవన్ ఖేరా ఒక ప్రెస్ మీట్‌లో హిమంత శర్మ కుటుంబంపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆయన భార్యకు పలుమార్లు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.ఈ ఆరోపణలను రిణికి భుయాన్ శర్మ పూర్తిగా ఖండిస్తూ, అవి తప్పుడు మరియు కల్పితమైనవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చట్టపరమైన చర్యలకు దిగారు.
ఈ పరిణామంతో అస్సాం రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ఆరోపణలు, ప్రతియుత్తరాలు తీవ్ర స్థాయికి చేరాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అస్సాం సీఎం హిమంత శర్మ కూడా ఈ ఆరోపణలను "రాజకీయ ప్రేరితమైనవి"గా అభివర్ణిస్తూ, అవసరమైతే పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించారు.
ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, రాజకీయంగా మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం కీలక అంశంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఢిల్లీ నివాసంలో అస్సాం పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య ఫిర్యాదు నేపథ్యంలో చోటుచేసుకుంది.

