కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధర పెంపు నిర్ణయం సమర్థనీయం కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది…నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది అన్నారు.
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది..ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటించింది అన్నారు.
ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే..కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్దాలు చెబుతారని ప్రజలు భావిస్తున్న..పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు రేవంత్.