Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని మోదీకి స్వీడన్ పురస్కారం

ప్రధాని మోదీకి స్వీడన్ పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్' అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించి..బహూకరించింది.

ఒక దేశ ప్రభుత్వ అధినేతకు (Head of Government) అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం ఇది.

స్వీడన్ పర్యటనలో భాగంగా గోథెన్‌బర్గ్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్వీడన్ క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ఆసియా నాయకుడిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు.

ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్వీడన్ రాజకుటుంబానికి, అక్కడి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డును 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు మరియు భారత్-స్వీడన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధానికి అంకితం చేస్తున్నాను. ఈ గౌరవం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి నిదర్శనం అని పీఎం మోదీ పేర్కొన్నారు.

18వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్' అవార్డును అంతర్జాతీయ దౌత్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసిన ప్రపంచ నాయకులకు అందిస్తారు. తాజాగా లభించిన ఈ పురస్కారంతో కలిపి ఇప్పటివరకు ప్రధాని మోదీకి వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి లభించిన అత్యున్నత పురస్కారాల సంఖ్య 31 కి చేరింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్' అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించి..బహూకరించింది. ఒక దేశ ప్రభుత్వ అధినేతకు (Head of Government) అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం ఇది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu