Dailyhunt
Ramayana:'రామాయణ' టీజర్

Ramayana:'రామాయణ' టీజర్

భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ' చిత్రం నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు నితీశ్‌ తివారి తెరకెక్కిస్తున్న ఈ మైథాలజికల్ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతోంది.

టీజర్‌లో రణ్‌బీర్ కపూర్… శ్రీరాముడి పాత్రలో కనిపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ వేషధారణలో ఆయన లుక్ ఎంతో శాంతమైనది, గంభీరమైనది గా ఉండి పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రణబీర్ లుక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు సమాచారం. సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయిపల్లవి, ఈ పాత్రకు మరింత భావోద్వేగ గాఢత తీసుకురానున్నట్లు అభిమానులు ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాండియర్ పరంగా కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. టీజర్ ద్వారా సినిమా పై భారీ అంచనాలు మరింత పెరిగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu