ఒక మైనర్ బాలికపై ఘోరమైన అఘాయిత్యం జరిగితే.. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఈ రాష్ట్ర హోంమంత్రి (ముఖ్యమంత్రి) రేవంత్ రెడ్డికి అసలు బుర్ర ఉందా?
అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఒక పోక్సో నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి.. 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవలు ఎవరు? చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ తోడుదొంగల మాదిరిగా మారి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారు..హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో, దిక్కులేక చివరకు నిందితుడు లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరి డ్రామాలు, అరెస్ట్ నాటకాలు ఎవరూ నమ్మరు అన్నారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తోడుదొంగల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.
బండి సంజయ్ POCSO కేసులో మీడియా వ్యవహరించిన తీరుకు మీరు సిగ్గు పడాలి..నేషనల్ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం రిపోర్ట్ కూడా చేయలేదు అన్నారు. కొంత మంది వెదవలు హానీ ట్రాప్ అని సిగ్గులేకుండా రిపోర్ట్ చేశారు… ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి నిందితుడిని 9 రోజులు కాపాడారు అన్నారు. ప్రధాన మంత్రి వచ్చాడని నిందితుడిని అరెస్ట్ చేయలేదు అంటున్నారు, అసలు తలకాయ ఉందా డీజీపీకి? .. ప్రధాన మంత్రి వస్తే నేరస్తులకు సెలవులు ఇస్తారా? చెప్పాలని ప్రశ్నించారు.
నా బామ్మర్ది ఫాం హౌస్ కేసు అంటున్నావు, అక్కడ ఏం దొరకలేదని నీ అధికారులే చెప్పారు కదా రేవంత్ రెడ్డి..9 రోజులు పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టిన చరిత్ర ఈ దేశంలో ఎన్నడైనా చూసామా? అని ప్రశ్నించారు.
ఒక మైనర్ బాలికపై ఘోరమైన అఘాయిత్యం జరిగితే.. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఈ రాష్ట్ర హోంమంత్రి (ముఖ్యమంత్రి) రేవంత్ రెడ్డికి అసలు బుర్ర ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఒక పోక్సో నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి.. 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవలు ఎవరు? చెప్పాలన్నారు.

