Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RSP:అబద్దాలకు కేరాఫ్‌గా సీఎం రేవంత్

RSP:అబద్దాలకు కేరాఫ్‌గా సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు చిరునామాగా మారారు అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. పోక్సో కేసులో సీఎం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారు…మైనర్ బాలికకు న్యాయం జరిగింది అంటే బిఆర్ఎస్ పార్టీ వలనే… బండి సాయి భగీరధ్ స్టేషన్ బెయిల్ తీసుకుని దర్జాగా బయట తిరిగేవాడు అన్నారు.

బండి సాయి భగీరధ్ ను అరెస్టు చేశామని సీఎం చెప్పారు… అడ్వకేట్లతో లొంగిపోయారని బండి సంజయ్ చెప్పారు… ప్రజలు ఎవరు చెప్పింది నమ్మాలి…?, రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర మొత్తం అబద్దాలు… బండి సాయి భగీరధ్ ఇద్దరు బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్లతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు..మీ లాంటి వాళ్ళ భరతం పట్టడానికి నేను నా పోలీస్ ఉద్యోగాన్ని వదులుకున్నా..రిటైర్డ్ అయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్లాలని ఎవరూ అనుకోరు… నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని రోజులు నాఖాబందీ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి…భాదితురాలి పేరును బయట పెట్టింది బీజేపీ వాళ్ళు అన్నారు.

రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారు… కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో భాదితురాలి కుటుంబంపై కేసు పెట్టి వాళ్ళ పేర్లు బయట పెట్టలేదా…?.బిఆర్ఎస్ మైనర్ బాలిక పేరు ఎప్పుడూ చెప్పలేదు..మైనర్ బాలిక వైపు ఏ పార్టీ నిలబడింది,భగీరధ్ వైపు ఏ పార్టీలు నిలబడ్డాయో ప్రజలకు తెలుసు..
బండి భగీరధ్ కు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడారు..బావా,మరదల్ల సంభందం అని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు..ఒక్క రోజు అయినా కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు ఎక్కారా…?,కేసీఆర్,కేటీఆర్ మాకు డైరెక్షన్ ఇచ్చారు అన్నారు.

బిఆర్ఎస్ ఎక్కడా రాజకీయం చేయలేదు..బండి భగీరధ్ ను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు..నాఖాబందీ నాకు తెలియదా…?,బండి సంజయ్ ఇంటికి పోలీసు బృందాలు ఎప్పుడు వెళ్లారు…బండి సాయి భగీరధ్,బండి సంజయ్ లోకేషన్ తీయండి..సీఎం రేవంత్ రెడ్డి నిందితుడిని అడుక్కుంటున్నారు..నేను బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో మాట్లాడాను..కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవడం ఖాయం..రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సిట్ ఎందుకు వేయలేదు..ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు వేర్వేరుగా సిట్ ఏర్పాటు చేశారు..బండి సాయి భగీరధ్ ను పోలీసు కస్టడీకి ఎందుకు కోరలేదు,60 రోజుల్లోపు పోలీసు కస్టడీకి తీసుకోవచ్చు…కాంగ్రెస్,బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ తో ఈ కేసులో మైనర్ బాలికకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు..
నిందితుడికి 9 రోజులు సమయం ఇచ్చారు..బండి భగీరధ్ సరెండర్ చేసిన మొబైల్ ఫోన్ అతనిది కాదని బాలిక తల్లి,దండ్రులు అంటున్నారు..నిందితుల్లో భగీరధ్ తో పాటు ఎవరు ఉన్నారో ప్రభుత్వం చెప్పాలి అన్నారు.

బీజేపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మైనర్ బాలికపై దుష్ప్రచారం చేశారు..వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..సెక్షన్ 14,15,ఫోక్సో యాక్ట్ ప్రకారం వీళ్ళను ఎందుకు జైలుకు పంపడం లేదు..రేవంత్ రెడ్డి రాజకీయం చేశారు..కేసులో నింధితుడితో పాటు బండి సంజయ్ పేరును,మిగతా వారి పేర్లను ఎందుకు చేర్చలేదు…బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్రలో ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు…బిఎన్ఎస్ సెక్షన్ 238 ప్రకారం శిక్ష పడబోతున్న వ్యక్తిని 9 రోజులు సీఎం కాపాడారు,బండి సంజయ్ కు నోటీసు ఇచ్చి వాంగ్మూలం తీసుకుని అరెస్టు చేయాలి..రేవంత్ రెడ్డి,ప్రధాన మంత్రి మోదీ,బండి సంజయ్,సంగప్ప,శ్రీరామ్ మధ్య జరిగిన సంభాషణ బయటపెట్టాలి,బండి సంజయ్ ను కాపాడమని మోడీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పలేదా…?,దీనిపై ఏ గుడిలో ప్రమాణం చేయడానికి అయినా నేను సిద్దం..
బండి సంజయ్ చట్టం ముందు,పోలీసుల ముందు లొంగిపోవాలి..బండి సంజయ్ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాలి..సోషల్ మీడియాలో మైనర్ బాలికపై నీచమైన కామెంట్స్ పెట్టారు..వారందరిని అరెస్టు చేయాలి..భాధితుల పక్షాన బిఆర్ఎస్ నిలబడింది..భగీరధ్ ను కాపాడటానికి అహోరాత్రం కాంగ్రెస్,బీజేపీ కష్టపడ్డాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వతహాగా లాయర్ బండి సంజయ్ కు ఏం సంబంధం అని అంటున్నారు..బిఆర్ఎస్ నేతలపై కేసుల కోసం రేవంత్ రెడ్డి 17 కోట్లు ఖర్చు పెట్టారు..రాష్ట్రంలో మైనర్ బాలికలకు భద్రత లేదు…ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు చిరునామాగా మారారు అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. పోక్సో కేసులో సీఎం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారు…మైనర్ బాలికకు న్యాయం జరిగింది అంటే బిఆర్ఎస్ పార్టీ వలనే… బండి సాయి భగీరధ్ స్టేషన్ బెయిల్ తీసుకుని దర్జాగా బయట తిరిగేవాడు అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu