Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RSP:బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి

RSP:బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన పోక్సో కేసు పై మైనర్ బాలికకు అండగా ఉన్న యావత్ తెలంగాణ ప్రజలకు నమస్కరిస్తున్నాము అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్..ఇంతమంది పోరాటం చెయ్యకుంటే పోక్సో కేసు బయటకు రాకపోతుండే…చట్టానికి వ్యతిరేకంగా బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారు అన్నారు.

బండి భగీరథ్ కు నేర చరిత్ర ఉంది, ఆ విషయం పోలీసులకు తెలుసు…తెలంగాణ మహిళ లోకానికి బండి భగీరథ్ తో ప్రమాదం పొంచి ఉంది…బండి భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసు పై పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు…బండి భగీరథ్ ను రక్షించాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తుంది అన్నారు. సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి భగీరథ్ గురించి మహిళ లోకానికి తెలియజేయాలి…ఈరోజు ఉదయం బాధితురాలు తల్లి నాతో మాట్లాడి ఆవేదనతో కొన్ని విషయాలు చెప్పుకుంది…రీతురాజ్ IPS అధికారికి ధన్యవాదాలు, ఆమె కేసును వేగవంతం చేస్తుంది ..బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడుగడుగున నాశనం చెయ్యాలని చూస్తున్నారు అన్నారు.

ఆమె పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు…కేంద్ర హోం శాఖ సహాయ మంత్రితో బాధితురాలు తల్లి కొట్లాట చేస్తాను అని నాతో చెప్పింది.
బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాశనం చేస్తున్నారు అని బాధితురాలు తల్లి ఆవేదన చెందుతుంది…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అమ్మాయి ఉంది ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది…సీతక్క, కొండ సురేఖ DGP తో మాట్లాడి బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.

ప్రధానిమంత్రి మోడీ బందోబస్తు ఉండడంతో కేసు విచారణ చెయ్యలేక పొయ్యాయి అని DGP చెప్పేలోపే బండి భగీరథ్ పారిపోయారు…నిందితుడి తండ్రితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ లో పాల్గొన్న తరువాత కేసు గురించి ఇంకేం విచారణ ఉంటుంది.బిజెపి నాయకులు బాధిత మహిళను మేజరా, మైనరా చర్చ చెయ్యడం బాధాకరం.కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారు.తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత , బాధితురాల అమ్మ బాధ ఒకసారి చూడాలి.రేవంత్ రెడ్డి, బిజెపి స్క్రిప్ట్ కవిత చదవి మర మనిషిలా ఉంటున్నారు.బిఆర్ఎస్ నాయకుల వల్లే బాధితురాల వివరాలు బయటకు వచ్చాయి అని కవిత అనడం సరికాదు అన్నారు.

ఒక సీనియర్ పోలీస్ అధికారి సలహా వల్లే బండి భగీరథ్ కరీంనగర్ లో భాదితురాలు పై కేసు పెట్టాడు…యూనివర్సిటీలో బండి భగీరథ్ ఇష్యూ అయినప్పుడే తన తండ్రి భగీరథ్ ను బయటకు పంపించుకోవాలి.బండి సంజయ్ కొడుకు పెంపకంలో తేడా ఉంది ..పిల్లలు అందరు ఒకటే పెంపకంలో లోపం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి.బండి సంజయ్ ను కలవాలి అంటే ముందు బండి భగీరథ్ ను కలవాలి అని కరీంనగర్ ప్రజలే అంటున్నారు.బండి భగీరథ్ కరీంనగర్ లో భాదితురాలు పై పెట్టిన కేసులో సెక్షన్ ఒకలా ఉన్నాయి.బండి భగీరథ్ పై బాధితురాలు పెట్టిన కేసులో సెక్షన్ 6 , 8 పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారు.బాధితురాలు పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలి.రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు.రిటైర్డ్ డీజీ ర్యాంక్ పోలీస్ అధికారి భార్యను పట్టపగలే నేపాల్ గ్యాంగ్ హత్య చేసింది.బండి సంజయ్ ను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్క వ్యక్తి వదిలి పెట్టను అని అంటున్నాడు.సీతమ్మ తల్లి కోసం ఆంజనేయుడు లంకను దహనం చేశాడు.ఆంజనేయుడు పేరు తీసే అర్హత బండి సంజయ్ కు లేదు.బండి సంజయ్ ఎవరిని బయపెట్టిస్తున్నాడు , బాధితురాలను బెదిరిస్తున్నారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా. బండి సంజయ్ వ్యాఖ్యలతో బాధితురాలు తల్లి భయపడుతుంది.దేశం కోసం ధర్మం కోసం పోక్సో కేసుల్లో అత్యధికంగా బిజెపి నేతల పైనే ఎక్కువ.బాధితురాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన పోక్సో కేసు పై మైనర్ బాలికకు అండగా ఉన్న యావత్ తెలంగాణ ప్రజలకు నమస్కరిస్తున్నాము అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్..ఇంతమంది పోరాటం చెయ్యకుంటే పోక్సో కేసు బయటకు రాకపోతుండే…చట్టానికి వ్యతిరేకంగా బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారు అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu