harish
జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సర్వే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, మండలి ప్రోటెం ఛైర్మన్ భూపల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 మండలాల్లో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
ఒక్క యాసంగిలోనే 90 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యపు భాండాగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతుబంధు ఆపలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మెదక్ జిల్లా కరువు జిల్లాగా ఉండేది. ఈ ప్రాంత పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.

