Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెయింట్ గోబైన్ ప్లాంట్‌ను సందర్శించిన విజయ్

సెయింట్ గోబైన్ ప్లాంట్‌ను సందర్శించిన విజయ్

మిళనాడు పారిశ్రామిక పురోగతికి మరింత ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక అడుగులు వేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యంగా సోమవారం ఆయన శ్రీపెరంబుదూర్-ఒరగడం పారిశ్రామిక కారిడార్‌లో పర్యటించారు.

సెయింట్ గోబైన్ ప్లాంట్ సందర్శన పర్యటనలో భాగంగా శ్రీపెరంబుదూర్ (ఇరుంగాట్టుకోటై) సమీపంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ గాజు తయారీ సంస్థ 'సెయింట్ గోబైన్' ప్లాంట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడి గ్లాస్ తయారీ ప్రక్రియను, ప్లాంట్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం…కంపెనీ ప్రతినిధులు మరియు ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగుల పనితీరును వారి సంక్షేమ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

పారిశ్రామిక ప్రగతిపై ప్రత్యేక సమీక్ష ఈ పర్యటనలో భాగంగా సిప్‌కాట్ (SIPCOT) ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించిన సీఎం విజయ్ ఆ ప్రాంతంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన వసతులు, విద్యుత్, రహదారుల అనుసంధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఒరగడంలోని డైమ్లర్ బసెస్ ,నిస్సాన్ ఆటోమొబైల్ తయారీ ప్లాంట్లను పరిశీలించారు.

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, అలాగే పరిశ్రమలకు ఎదురవుతున్న సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపడానికే సీఎం ఈ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనతో శ్రీపెరంబుదూర్-ఒరగడం పారిశ్రామిక ప్రాంతంలో మరింత ఉత్సాహం నెలకొంది.

తమిళనాడు పారిశ్రామిక పురోగతికి మరింత ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక అడుగులు వేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యంగా సోమవారం ఆయన శ్రీపెరంబుదూర్-ఒరగడం పారిశ్రామిక కారిడార్‌లో పర్యటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu