Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tata Sons: టాటా గ్రూపులో మళ్లీ వివాదం..

Tata Sons: టాటా గ్రూపులో మళ్లీ వివాదం..

టాటా గ్రూపులో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా…. టాటా సన్స్ బోర్డు సమావేశానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్స్ ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను తిరిగి నియమించే ప్రక్రియపైనా ఆయన పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు నవంబర్ 26న జరగనున్న టాటా సన్స్ కీలక బోర్డు సమావేశానికి ముందే చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నవంబర్ 20న టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాశ్ ముఖోపాధ్యాయకు నోయెల్ టాటా మరో లేఖ రాశారు. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశానికి సంబంధించిన పూర్తి, ఎలాంటి మార్పులు చేయని ఆడియో, వీడియో రికార్డింగ్స్ అందించాలని కోరారు. అదే విధంగా బోర్డు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (NRC) సెప్టెంబర్ 3న నిర్వహించిన సమావేశానికి సంబంధించిన రికార్డింగ్స్, ట్రాన్స్‌క్రిప్ట్‌లను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలోనే చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న విధానం… సమావేశంలో అనుసరించిన ప్రక్రియపై నోయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 17న జరిగిన సమావేశానికి సంబంధించిన తుది సంతకాలతో కూడిన మినిట్స్ ఇవ్వాలని నోయెల్ కోరారు. అవి ఇంకా ఖరారు కాకపోతే తన సూచనల్లో ఏవి ఆమోదించారో, ఏవాటిని తిరస్కరించారో తెలిపే సవరించిన ముసాయిదాను అందించాలని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించిన నోటీసులు, ఎజెండాలో చేసిన మార్పులు, వాటిని ఎవరు సూచించారనే వివరాలు, బోర్డు వెబ్ అప్లికేషన్‌లో పత్రాలను అప్‌లోడ్ చేసిన సమయానికి సంబంధించిన వివరాలను కూడా కోరారు.

అంతేకాకుండా అసలు రికార్డింగ్స్, వాటికి సంబంధించిన మెటాడేటాను భద్రపరచాలని సూచించారు. ఈ అంశాలపై నవంబర్ 25లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. నవంబర్ 26న టాటా సన్స్ తదుపరి బోర్డు సమావేశం జరగనుండటంతో ఈ గడువు కీలకంగా మారింది.

టాటా గ్రూపులో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా…. టాటా సన్స్ బోర్డు సమావేశానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్స్ ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను తిరిగి నియమించే ప్రక్రియపైనా ఆయన పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు నవంబర్ 26న జరగనున్న టాటా సన్స్ కీలక బోర్డు సమావేశానికి ముందే చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu