Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGSRTC:ఆసక్తికర సందేశం వైరల్!

TGSRTC:ఆసక్తికర సందేశం వైరల్!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులో కనిపించిన ఒక చిన్న ప్రకటన/సందేశం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది.

సమాజంలో మారుతున్న ఆలోచనలకు, లింగ సమానత్వానికి సంబంధించిన చర్చలకు ఈ సందేశం ఒక వేదికగా మారింది. ఇటీవల TGSRTC బస్సులో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు బస్సు లోపల ఉన్న ఒక ఆసక్తికరమైన స్లోగన్‌ను గమనించారు.

పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం… అని రాసి ఉన్న ఆ సందేశాన్ని ఆమె తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు, ముఖ్యంగా ప్రయాణికులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.సమానత్వానికి నిదర్శనం: బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఉన్నట్లే.. పురుషులకు కేటాయించిన పరిమిత సీట్లను వారికి కేటాయించడం, వారి పట్ల గౌరవం చూపించడం సరైన పద్ధతి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమైన 'సమానత్వానికి' సంకేతమని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు మాత్రం ఇలాంటి ప్రత్యేక సందేశాల అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా బస్సుల్లో రద్దీని బట్టి ఒకరికొకరు సర్దుకుపోవడం సహజమని దీనిని ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పనిలేదని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బస్సుల్లో మహిళలు, పురుషుల సీట్ల కేటాయింపు మరియు పరస్పర గౌరవంపై ఈ చిన్న సందేశం పెద్ద చర్చకే దారితీసింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులో కనిపించిన ఒక చిన్న ప్రకటన/సందేశం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. సమాజంలో మారుతున్న ఆలోచనలకు, లింగ సమానత్వానికి సంబంధించిన చర్చలకు ఈ సందేశం ఒక వేదికగా మారింది. ఇటీవల TGSRTC బస్సులో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు బస్సు లోపల ఉన్న ఒక ఆసక్తికరమైన స్లోగన్‌ను గమనించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu