Dailyhunt
టీఆర్ఎస్‌తోనే దుబ్బాక అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

టీఆర్ఎస్‌తోనే దుబ్బాక అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

టీఆర్ఎస్‌తోనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్..టీఆర్ఎస్ గెలిస్తేనే దుబ్బాక అభివృద్ధి జరుగుతుందన్నారు.

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 400 పెన్షన్ ఇస్తున్నారని.. అలాంటోళ్లు మనకు 1600 ఇస్తున్నామని అంటే నమ్ముతామా ? అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కళ్ళల్లో ఓత్తులు వేసుకొని ఎదురు చూసే వాళ్ళని.. ఈ రోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ లు పైసలు, సీసాలను నమ్ముకున్నారని.. టీఆర్ఎస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నదని తెలిపారు. సంక్షేమానికి కేసీఆర్ సముద్రమంత ఇస్తే..

కేంద్రం ఇచ్చింది కాకిరెట్టంత అని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఎండమావుల వంటి పార్టీలని మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu