రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతోందని, వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకుని పార్టీని కాపాడాల్సిన సమయం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖలో కొందరు మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
20-30 శాతం కమిషన్లు,భూకబ్జాలు,మంత్రుల కుటుంబాల అనైతిక వ్యవహారాలు… ఇవి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తున్నాయని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.
ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా, కొందరు మంత్రులు ఏ విషయంలోనూ పట్టులేని "డమ్మీ మంత్రులు"గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఏకమై గళం విప్పాలని ఎన్నారైలు కోరారు. పార్టీ పునరుద్ధరణ కోసం ఇది అత్యవసరమని పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ లేఖలో కొందరు మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 20-30 శాతం కమిషన్లు,భూకబ్జాలు,మంత్రుల కుటుంబాల అనైతిక వ్యవహారాలు… ఇవి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తున్నాయని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.

