Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టిమ్స్‌తో ప్రపంచ స్థాయి వైద్యం:కేటీఆర్

టిమ్స్‌తో ప్రపంచ స్థాయి వైద్యం:కేటీఆర్

పేదవాడి కన్నీరు తుడిచిన నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం అన్నారు.

ఎర్రగడ్డలోని TIMS ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ కట్టించారు అన్నారు.

రూ.1200 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కేవలం ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.

ఒక రాజభవాన్ని తలపించే విధంగా పేదల కోసం హైదరాబాద్ నాలుగు వైపులా ఇలాంటి టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ కట్టించాడు..హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు అన్నారు.

గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే హైదరాబాద్‌లో ప్రధాన ఆధారం కాగా, మా ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చాం…హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం సామాన్యులకు కూడా అందాలనే కేసీఆర్ ఆలోచనతో టిమ్స్‌ను రూపకల్పన చేశాం అన్నారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం అన్నారు.

పేదవాడి కన్నీరు తుడిచిన నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం అన్నారు. ఎర్రగడ్డలోని TIMS ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ కట్టించారు అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu