Dailyhunt
టీవీకేతో పొత్తుపై కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్

టీవీకేతో పొత్తుపై కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ గట్టిగా సమర్థించుకున్నారు.

ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ప్రస్తుత అధికార పక్షాన్ని (DMK కూటమిని) తిరస్కరించారని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ప్రజలు ఎవరినైతే వద్దనుకున్నారో, వారి పక్షాన మేము ఎందుకు నిలబడాలి? అని ఆయన ప్రశ్నించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. తమిళనాడులో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.

దశాబ్దాల కాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాదని విజయ్ వైపు వెళ్లడంపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, ప్రజా తీర్పును కాదని ఎవరూ ముందుకు వెళ్లలేరని స్పష్టం చేశారు.

విజయ్ ప్రభుత్వం లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని తాము భావిస్తున్నామని, అందుకే షరతులతో కూడిన మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యలు తమిళనాడులో డీఎంకే మరియు కాంగ్రెస్ మధ్య ఉన్న సుదీర్ఘ బంధానికి తెరపడిందని స్పష్టం చేస్తున్నాయి. విజయ్ పార్టీకి ఉన్న 108 సీట్లకు, కాంగ్రెస్ 5 సీట్లు తోడవ్వడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి టీవీకే మరింత చేరువయ్యింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ గట్టిగా సమర్థించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu