కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి అభిషేక సేవను ఇకపై సామాన్య భక్తులు కూడా వీక్షించేలా సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
సాధారణంగా శుక్రవారం నాడు జరిగే శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనడం లేదా వీక్షించడం సామాన్య భక్తులకు ఎంతో కష్టతరమైన విషయం. అయితే, తిరుమలలో నిరంతరం పెరుగుతున్న భక్తుల రద్దీని, స్వామివారిని దర్శించుకోవాలనే సామాన్యుల కోరికను దృష్టిలో ఉంచుకుని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
ఈ నూతన విధానం ద్వారా దాదాపు 5,850 మంది సామాన్య భక్తులకు శ్రీవారి అభిషేక సేవను కళ్లారా వీక్షించే అద్భుతమైన అవకాశం కలగనుంది.తిరుమలలో భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం గురువారం ఒక్కరోజే 79,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతటి భారీ రద్దీ ఉన్నప్పటికీ, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, వారికి ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది.
ఎన్నో ఏళ్లుగా కేవలం ప్రముఖులకే (VIPs) పరిమితం అనుకున్న అభిషేక సేవను, తమలాంటి సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి అభిషేక సేవను ఇకపై సామాన్య భక్తులు కూడా వీక్షించేలా సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.

