Dailyhunt
TTD:బుగ్గోత్సవ మహోత్సవాలు

TTD:బుగ్గోత్సవ మహోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర ఉత్సవాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న బుగ్గ పుష్కరిణి వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలిసి స్వామివారి ఊంజలసేవ నిర్వహించి, అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

తదనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ బుగ్గోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ ఆహ్వానిస్తోంది.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర ఉత్సవాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న బుగ్గ పుష్కరిణి వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu