Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
USA:వైట్ హౌస్ సమీపంలో కాల్పులు

USA:వైట్ హౌస్ సమీపంలో కాల్పులు

వైట్ హౌస్ వెలుపల పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించడంతో, అధ్యక్ష భవన సముదాయం పరిసర ప్రాంతాలకు పోలీసు అధికారులు, ఫెడరల్ ఏజెంట్లు భారీగా చేరుకోవడంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, శనివారం సాయంత్రం 6 గంటల (ET) తర్వాత ఒక వ్యక్తి చెక్‌పాయింట్ వద్దకు వచ్చి, "తన బ్యాగ్ నుండి ఆయుధాన్ని తీసి అక్కడ ఉన్న అధికారులపై కాల్పులు జరపడం ప్రారంభించాడు" అని యూఎస్ సీక్రెట్ సర్వీస్ శనివారం ఆలస్యంగా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనలో తమ అధికారులెవరికీ గాయాలు కాలేదని, ఆ సమయంలో వైట్ హౌస్‌లోనే ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదని సీక్రెట్ సర్వీస్ పేర్కొంది.

వైట్ హౌస్ వెలుపల సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపిన గన్‌మ్యాన్, ఎదురుకాల్పుల్లో గాయపడి మరణించినట్లు సదరు సంస్థ అమెరికన్ మీడియాకు అందించిన ప్రకటనలో తెలిపింది.

ఈ కాల్పుల సమయంలో ఒక బాటసారికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని, అయితే ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉందనేది సంస్థ వెల్లడించలేదు.

వైట్ హౌస్ వెలుపల పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించడంతో, అధ్యక్ష భవన సముదాయం పరిసర ప్రాంతాలకు పోలీసు అధికారులు, ఫెడరల్ ఏజెంట్లు భారీగా చేరుకోవడంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu