Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీధి కుక్కల తొలగింపుపై సుప్రీం తీర్పు

వీధి కుక్కల తొలగింపుపై సుప్రీం తీర్పు

హిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ సంస్థల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి సుప్రీం కోర్టు (Supreme Court)మంగళవారం నిరాకరించింది.

కుక్కల దాడుల(Stray Dogs) భయం లేకుండా బతికే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు, బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ నవంబర్ 2025లో ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని కోర్టు తేల్చి చెప్పింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా మరియు జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన జీవన హక్కులో.. కుక్క కాటు సంఘటనల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా ఒక భాగమని, ఈ విషయంలో ప్రభుత్వం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదు అని ధర్మాసనం పేర్కొంది.

చిన్నారులు, వృద్ధులు మరియు అంతర్జాతీయ ప్రయాణికులు వీధి కుక్కల కాటుకు గురవుతున్న కఠినమైన వాస్తవాలను కోర్టు విస్మరించలేదు. సమాజంలో పిల్లలు, వృద్ధులు కేవలం కుక్కల దయపై లేదా వారి శారీరక బలంపై ఆధారపడి బతకాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతి జిల్లాలో 'యానిమల్ బర్త్ కంట్రోల్' కేంద్రాలు..పౌరుల రక్షణతో పాటు జంతు సంక్షేమాన్ని సమతూకం చేస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాల అమలును నిరంతరం పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాల హైకోర్టులు స్వచ్ఛందంగా (Suo Motu) కేసులను నమోదు చేసి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న వీధి కుక్కల దాడి ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విచారణలో భాగంగా ఈ కీలక తీర్పు వెలువడింది.

బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ సంస్థల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి సుప్రీం కోర్టు (Supreme Court)మంగళవారం నిరాకరించింది. కుక్కల దాడుల(Stray Dogs) భయం లేకుండా బతికే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు, బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ నవంబర్ 2025లో ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని కోర్టు తేల్చి చెప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu