Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే.

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే.

Gulte.com 3 weeks ago

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్లు వచ్చే వరకు గ్లామర్ రోల్స్ తో బిజీగా ఉంటారు.

ఆ వయసు దాటాక ఆఫర్లు మెల్లగా తగ్గిపోతుంటాయి. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేసి లాంగ్ రన్ లో నిలబడాలని అనుపమ పరమేశ్వరన్ ఒక సరికొత్త రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
కెరీర్ మొదట్లో ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకుంది.

అయితే అమ్మడి క్యూట్ నెస్ తోనే ఇంకో నాలుగైదేళ్లు ఈజీగా నెట్టుకురావచ్చు. కానీ 30 ఏళ్లు దాటాక అదే ఇమేజ్ కంటిన్యూ చేస్తే కొత్త హీరోయిన్ల పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేవలం గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనకు స్కోప్ ఉన్న పాత్రల వైపు ఫోకస్ మార్చింది. విద్యాబాలన్, టబు లాంటి సీనియర్లు ముందే ట్రాక్ మార్చుకున్నారు కాబట్టే ఇప్పటికీ లీడ్ రోల్స్ దక్కించుకుంటున్నారు. ఇప్పుడు అనుపమ కూడా అదే దారిలో నడుస్తోంది.

గత రెండేళ్లుగా అనుపమ ఎంచుకుంటున్న కథలు చూస్తే ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ స్పష్టంగా అర్థమవుతుంది. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత కమర్షియల్ ఆఫర్లు చాలానే వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టింది. పరదా, లాక్ డౌన్, మరీచిక లాంటి లేడీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంది. ముఖ్యంగా ‘మరీచిక’లో వెంకటలక్ష్మి క్యారెక్టర్ లో చేసిన ప్రయోగానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్స్ ఎంచుకోవడం వెనుక కొంత రిస్క్ కూడా లేకపోలేదు. కమర్షియల్ సినిమాలు వదిలేస్తే మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది.

‘కిష్కిందపురి’ మినహా మిగతా ప్రయోగాత్మక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే తాత్కాలిక హిట్ల కోసం కాకుండా, నటిగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ ప్రయోగాలు కంటిన్యూ చేస్తోంది. సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి వాళ్లు కేవలం గ్లామర్ తోనే కాకుండా తమ టాలెంట్ తోనే ఇండస్ట్రీలో నిలబడ్డారు.

ఇప్పుడు అనుపమ కూడా ఆ రూట్ నే ఫాలో అవుతోంది. 30 ఏళ్ల వయసులోనే ఇమేజ్ మార్చుకుని భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకుంటోంది. కమర్షియల్ గా కొన్ని సినిమాలు వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ మెప్పు పొందితే భవిష్యత్తులో బలమైన పాత్రలు దక్కుతాయని నమ్ముతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu