Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం. కేవలం వారికే!

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం. కేవలం వారికే!

Gulte.com 1 week ago

మ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పసి పిల్లల తల్లీ దండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిముషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

ఎలాంటి రుసుము లేకుండా, ఆన్లైన్ బుకింగ్ టోకెన్లు లేకుండానే ఈ సౌకర్యం పొందే అవకాశం వుంది.

శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు ఒక సంవత్సరంలోపు పిల్లలు ఉండాలి. చిన్నారితో పాటుగా తల్లీ తండ్రికి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ వారికి 12 ఏళ్ళ లోపు పిల్లలుంటే వారికి కూడా అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు ‘సుపథం ‘ మార్గం ద్వారా లోపలికి అనుమతిస్తారు. ఇందుకోసం సుపథం వద్దకు వెళ్లి శిశువు బర్త్ సర్టిఫికెట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జీ సమ్మరీ లెటర్ చూపిస్తే చాలు.

దీనికి షరతులు వర్తిస్తాయి. టీటీడి నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. 40 నిముషాల్లో దర్శనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక సుపథం వద్దకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. శిశువుకు ఇబ్బంది కలగకుండా పాలు, డైపర్స్, మంచి నీళ్లు తీసుకొని వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. పూర్తి వివరాల కోసం టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ 0877-2233333 కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu