దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ మీద ఉన్నాయి. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు నిమిషాల గ్లిమ్ప్స్ ని కానుకగా ఇస్తామని ముందే ప్రకటించడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఆతృతగా ఎదురు చూశారు.
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్న ఈ సినిమా మీద ప్రకటన స్టేజి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఆఫ్గనిస్తాన్, బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భారతదేశం కేంద్రంగా ఓపియుమ్ అనే ప్రమాదకర డ్రగ్ వ్యాపారం జడలు విప్పుతుంది. బ్రిటిషర్లు వదిలేసి వెళ్ళిపోయిన చోట మాఫియా పురుడు పోసుకుని ఒక పెద్ద సామ్రాజ్యంగా రూపాంతరం చెందుతుంది. అందులో నుంచి పుట్టుకొస్తాడు లూగర్ (జూనియర్ ఎన్టీఆర్). శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న ఈ రాక్షసుడిని పట్టుకోవడానికి ప్రభుత్వం కదులుతుంది. ఆ తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడాలి.

