Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిమానులు కోరేవి వేరే ఉన్నాయి

అభిమానులు కోరేవి వేరే ఉన్నాయి

Gulte.com 2 weeks ago

అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతిని మర్చిపోతున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఈసారి అగ్రెసివ్ ప్రమోషన్లు కోరుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ ఫలితం ముందే తెలుసు కాబట్టి దానికి పబ్లిసిటీ విషయంలో నిర్లక్ష్యం వహించినా ఊరుకున్నామని, కానీ పెద్దికి అలా జరగకూడదని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కంప్లయింట్స్ మొదలుపెట్టేశారు.

వాళ్ళిలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. పెద్దికి ఏది చేసినా కింగ్ సైజులో ఉండాలని వాళ్ళ ఫీలింగ్. కానీ ఇప్పటికైతే అలాంటి మూమెంట్ లేదు. పెద్ది కారుని తీసుకొచ్చి సుస్మితకి చూపించి ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలినంత మాత్రాన ఎగ్జైట్ మెంట్ వచ్చేయదు. దాన్ని రామ్ చరణ్ లేదా చిరంజీవి తోలాలి. అలాంటివి అభిమానులకు కిక్ ఇస్తాయి. ఆ క్లిప్పులు త్వరగా వైరల్ అయిపోయి ఎక్కువ అటెన్షన్ తీసుకొస్తాయి. ఈ తరహలో ఆలోచించాలట.

దర్శకుడు బుచ్చిబాబు వీటిని సరిచేసేంత ఫ్రీగా లేడు. పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ కట్, రెహమాన్ రీ రికార్డింగ్, డిఐ, విఎఫెక్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ అంటూ సవాలక్ష పనులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తను జూన్ 25 అనుకుంటే అది జూన్ 4 కావడంతో ప్రెజర్ రెట్టింపు ఉంది. సో విడుదలకు కొద్దిరోజులు ముందు మాత్రమే బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ప్రమోషన్ బాధ్యతలు ఎవరు చూసుకోవాలంటే పూర్తిగా ప్రొడక్షన్ టీమ్, పిఆర్ మీదే ఉంటుంది

పెద్ది బ్యాట్లు, టీ షర్టులు లాంటివి అమ్మడం వరకు ఓకే. వీటితో పాటు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సినిమాను మరింత చేరువ చేయాలంటే రాజమౌళి స్థాయిలో ఆలోచించాలి. పుష్ప 2కి బీహార్ ఈవెంట్ ఎంత ప్లస్ అయ్యిందో చూశాం. అలాంటివి ఆలోచించాలి. అంతే తప్ప హైదరాబాద్ లోనే ఉంటూ అంతా జరిగిపోవాలంటే కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చూడాలి మరి ఎలాంటి క్రియేటివ్ ఐడియాస్ వేస్తారో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu