Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారులు నాన్ లోకల్. ఎమ్మెల్యే లోకల్

అధికారులు నాన్ లోకల్. ఎమ్మెల్యే లోకల్

Gulte.com 1 week ago

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ముఖ్య అతిథి అయిన దానం రాకుండానే అధికారులు లక్కీ డ్రా నిర్వహించడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యవహారంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా అధికారులపై దాడి చేస్తేనే వారు మాట వింటారు అంటే అలా చేయడానికి రెడీ అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు, ప్రభుత్వ అధికారులను కొట్టడం తనకు కొత్తేమీ కాదని, అది తనకు అలవాటేనని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయానని మీడియా ముందే ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, లబ్ధిదారుల జాబితాలో తన నియోజకవర్గం వారు కాకుండా బయటివారు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, హౌసింగ్‌ బోర్డు ఎండీ గౌతమ్‌ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. ఆయన వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని, అసెంబ్లీలో కూడా ఈ వ్యవహారం గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని అన్నారు.

అధికారులు వస్తుంటారు పోతుంటారు…దానం నాగేందర్ లోకల్ అంటూ ఇడియట్ లో రవితేజ మాదిరి డైలాగ్ చెప్పారు దానం. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని స్పష్టం చేశారు. ఎక్కడో కుట్ర జరుగుతోందని, అధికారుల ప్రవర్తన బాగోలేదని, దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu