Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్కడ సూర్య, లాల్.. ఇక్కడ చరణ్?

అక్కడ సూర్య, లాల్.. ఇక్కడ చరణ్?

Gulte.com 2 weeks ago

బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు ఉంటే.. గొప్ప టాక్ లేకపోయినా అద్భుతాలు చేయొచ్చని ఇటీవల రెండు సౌత్ సినిమాలు రుజువు చేశాయి. తమిళంలో సూర్య నటించిన 'కరుప్పు' అంత గొప్ప సినిమా ఏమీ కాదు.

ఇందులో ఏ కొత్తదనం కనిపించదు. బిగితో సాగే సినిమా కూడా కాదు. కేవలం ఫ్యాన్ మూమెంట్స్, మాాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలుండడం, ట్రెండుకు తగ్గట్లుగా డివైన్ ఎలిమెంట్స్ జోడించడంతో సినిమా ఊహించని విజయాన్నందుకుంది. సరైన సినిమా లేని టైంలో ఒక పెద్ద హీరో సినిమా పడడంతో తమిళ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు.

ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి అద్భుతమే చోటు చేసుకుంది. గత వీకెండ్లో రిలీజైన మోహన్ లాల్ సినిమా 'దృశ్యం-3' నెగెటివ్ టాక్‌తో మొదలై కూడా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దృశ్యం ఫ్రాంఛైజీలో మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే ఇది సాధారణం. అయినా వసూళ్లకు ఢోకా లేదు. ఈ కోవలోనే వచ్చే వారం రాబోయే తెలుగు సినిమా 'పెద్ది'కి కూడా బాక్సాఫీస్ దగ్గర పూర్తి అనుకూల పరిస్థితులు ఉండడంతో టాక్‌తో సంబంధం లేకుండా అద్భుతాలు చేయగలదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా వెలవెలబోయిందో తెలిసిందే. పెద్ద హీరోల సినిమాల జాడే లేకపోయింది. వేసవి మొత్తానికి కాస్త పేరున్న సినిమా అంటే.. 'డెకాయిట్' మాత్రమే. దానికి టాక్ బాలేకున్నా మంచి వసూళ్లే వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ బాక్సాఫీస్‌లో డ్రై రన్ మొదలైంది. గత నెలన్నర రోజుల్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మేలో చివరి రెండు వారాలనైతే ఖాళీగా వదిలేశారు. చిన్న చితకా సినిమాలేవో రిలీజ్ కాగా.. వాటిని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. వారి దృష్టంతా 'పెద్ది' మీదే ఉంది.

మంచి సినిమా వస్తే థియేటర్లకు రావడానికి జనం రెడీగానే ఉన్నారు. దీంతో 'పెద్ది' సినిమా కోసం కళ్లు మూసుకుని వెళ్లిపోతారనడంలో సందేహం లేదు. మరీ బ్యాడ్ టాక్ వస్తే తప్ప వీకెండ్లో జనాలతో థియేటర్లు కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి భారీ ఓపెనింగ్స్ లాంఛనమే. 'పెద్ది' సినిమా అమ్మకాలు పెద్ద మొత్తాలకే జరిగినా సరే.. సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చినా బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. ఇక సూపర్ హిట్ టాక్ కనుక వస్తే.. రికార్డుల మోత మోగడం.. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా ఇది నిలవడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu