Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలిగి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అలిగి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

Gulte.com 4 days ago

టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ పేరు ఇటీవల ఎలా మార్మోగిందో తెలిసిందే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌కు బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఆయనకు ఎక్కువ పట్టు, పేరు ఉన్నది ఎగ్జిబిటర్‌గానే.

తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో అనేక మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లు కూడా నడుస్తున్నాయి. ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల కోసమే గళం విప్పారు. ఐతే నాగవంశీ, మైత్రీ రవిశంకర్ తదితరులు సునీల్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది.

ఆ తర్వాత ఆయన ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ నాగవంశీ మీద వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక.. తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తర్వాత జరిగిన ఫిలిం ఛాంబర్ మీటింగ్‌ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వాళ్లతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్లోనూ అందరితో కలిసి ఫొటో దిగడానికి నిరాకరించడం తెలిసిందే.

ఐతే తాజాగా సునీల్ నారంగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఛాంబర్ ప్రతినిధులకు నిన్న లేట్ నైట్ ఆయన రాజీనామా లేఖను పంపించారు. పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అని, సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీపై అందరూ ఒక అవగాహనకు వచ్చారని ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందులో అంశాలు ఫైనల్ కాదంటూ సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఒక నోట్ రిలీజ్ చేశారు.

ఆ తర్వాత కాసేపటికే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కొందరు ఆఫీస్ బేరర్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి తాను పని చేయలేనని.. తన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదని సునీల్ తేల్చేశారు.

ఛాంబర్లో నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో జరగాల్సి ఉన్నప్పటికీ, అలా జరగడం లేదని, అందుకే తక్షణం తనను అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు సునీల్. తన స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు శేఖర్ లేదా విజేందర్ పేర్లను సూచించారు సునీల్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu