Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?

అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?

Gulte.com 1 week ago

పీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్మించనున్నట్టు కూడా తెలిపింది.

రెండో దశ భూ సమీకరణను కూడా విమానాశ్రయం కోసమే చేపట్టారు. ఇప్పుడు.. దీనిపై పక్కా క్లారిటీ ఇస్తూ.. ప్రభుత్వం మ్యాప్‌ను విడుదల చేసింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. తాడికొండ మండలం రావెల సమీపంలో ప్రతిపాదించారు.

ఈ విమానాశ్రయం విజయవాడకు దక్షిణ దిశలో సుమారు 35 కిలో మీటర్ల దూరంలో ఉండనుందని మ్యాప్‌ను బట్టి తెలుస్తోంది. మొత్తం 5 వేల ఎకరాల్లో 4,618 ఎకరాలను ప్రపంచ స్థాయి సదుపాయాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తారు.

మరో 380 ఎకరాలను పార్కింగ్ సదుపాయం కోసం కేటాయించనున్నారు. రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాలకు అనుసంధానం దృష్ట్యా విమానాశ్రయ నిర్మాణం కోసం.. రావెల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.

ఔటర్ రింగ్‌కు సమీపంలో ..

రాజధాని అమరావతిలో.. ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ విమానాశ్రయం ఉండ నుంది.
ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కాగా.. ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రమే చేపట్టనుందని అంటున్నారు. రెండు దశల్లో నిర్మించే ఈ విమానాశ్రయాన్ని తొలి దశలో 3400 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ప్రస్తుతం భూ సేకరణ జరుగుతోంది. కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియకు కొంత విరామం లభించినట్టు అయింది.

భారీ ప్రణాళిక..

అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భారీ ప్రణాళికే వేయనున్నారు. బోయింగ్ 777 విమానాలు దిగేలా డిజైన్ చేస్తున్నారు. రాబోయే 60 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా 5 దశల్లో విస్తరణ ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు తెలిపారు. వచ్చే పదేళ్లలో 60 లక్షల మంది ప్రయాణికు లు ఈ విమానాశ్రయం ద్వారా సేవలు పొందుతారని అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu