Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతికి పంచ సూత్రాలు. చంద్రబాబు భారీ ప్లాన్‌

అమరావతికి పంచ సూత్రాలు. చంద్రబాబు భారీ ప్లాన్‌

Gulte.com 6 hrs ago

ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్‌) నుంచి నిర్మాణాల వరకు ఆయన మనసు పెట్టి పని చేస్తున్నారు.

కేంద్రం సహా ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పనులను తొలిదశలో 2028 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి విషయంపై స్పందిస్తూ.. పంచ సూత్రాలతో ముందుకు సాగుతున్నట్టు వివరించారు. తద్వారా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.

ఏంటా సూత్రాలు..

  1. నో పోల్ సిటీ: సహజంగా విద్యుత్తు, టెలిఫోన్ సౌకర్యం, టీవీ చానెళ్ల వైర్లు బహిరంగంగా వేలాడుతుంటాయి. అయితే.. అమరావతిలో ఇలాంటి ఏర్పాట్లు ఉండవు. అన్నీ భూ గర్భంలోనే ఉండనున్నాయి. తద్వారా అమరావతిని నో పోల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. అంటే.. లైట్లు తప్ప ఎక్కడా ఎలాంటి పోల్స్ మనకు కనిపించవు. కేవలం అన్నీ భూగర్భంలోనే ఉండనున్నాయి.
  2. బ్లూ సిటీ: అమరావతి నగరం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఇక్కడ నీరు.. సమృద్ధిగా ఉండనుంది. దీంతో అమరావతిని ఇన్ లాండ్ కాలువలతో అనుసంధానం చేయనున్నారు. బ్రిటన్‌లో ఉన్నట్టుగా అమరావతి ప్రాంతం చుట్టూ ఉన్న నీరు కూడా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో అమరావతికి చుక్కనీటి ఎద్దడి లేకుండా చేస్తున్నారు.
  3. గ్రీన్ సిటీ: అంటే.. హరిత నగరం. అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు నగరంలో సగభాగం పచ్చదనంతో ఉండనుంది. చుట్టూ మొక్కలు, పచ్చికతో హరిత వనాన్ని తలపించేలా నగరాన్ని సుందరీకరిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెట్లతోపాటు పర్యావరణ అనుకూల ఆక్సిజన్ ఇచ్చే చెట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
  4. హరిత ఇంధనం: అమరావతిని పూర్తిగా హరిత ఇంధన నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం దేశంలో మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్ మాత్రమే హరిత రాజధానిగా ఉండగా.. దానిని మించిన స్థాయిలో అమరావతిని తీర్చిదిద్దనున్నారు. పూర్తిగా హరిత ఇంధన వాహనాలు.. నెట్ జీరో కాలుష్య నగరంగా అమరావతిని నిర్మిస్తున్నారు. చుట్టూ పచ్చిక బైళ్ల కారణంగా ఎప్పుడూ కాలుష్య రహితంగా నగరం ఉండనుంది.
  5. డీప్ టెక్నాలజీ: అధునాత టెక్నాలజీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా.. సాంకేతికలో అమరావతి నగరం ముందుండేలా చేస్తున్నారు. సెల్ ఫోన్ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. అన్ని విషయాల్లోనూ.. పనితీరులోనూ.. సాంకేతికత ఉట్టిపడనుందని చంద్రబాబు చెబుతున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu