Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుకోని చిక్కులన్నీ 'ఆదర్శం' వల్లే

అనుకోని చిక్కులన్నీ 'ఆదర్శం' వల్లే

Gulte.com 1 hr ago

ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాయిదా ఇతర చిన్న సినిమాల ప్లానింగ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

అదే డేట్ కి రావాల్సిన సమ్మర్ హాలిడేస్ ని నవంబర్ 6కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆవేదనతో ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో ఎప్పుడు వచ్చినా జనం చూస్తారని, కానీ తమకు అలాంటి ఆప్షన్ ఉండదని చెప్పుకొచ్చారు.

ఇప్పటిదాకా పబ్లిసిటీకి చేసిన ఖర్చుకు అదనంగా ఇంకో వారం రోజులు ప్రమోషన్ల కోసం అప్పులు తేవాల్సి వస్తుందనే తరహాలో బాధను వ్యక్తం చేశారు. ఇదే కాదు, ఇప్పటికే ఆదర్శ కుటుంబం వల్ల ఇబ్బంది పడిన ఇట్లు అర్జున సైతం నవంబర్ 6కి వెళ్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అందుకే హఠాత్తుగా టీమ్ సైలెంట్ అయ్యిందనే మాట ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఒక్క విశ్వక్ సేన్ కల్ట్ మాత్రమే ఆదర్శ కుటుంబంతో క్లాష్ అయ్యేందుకు సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఇదంతా వాయిదాల పర్వంతో వచ్చిన చిక్కు.

చిన్న సినిమాలు వీటి వల్ల ఎంతగా ఇబ్బంది పడుతున్నాయా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదర్శ కుటుంబంకు సమస్యలు ఉండొచ్చు.. కానీ వాటి ప్రభావం ఇతరుల మీద పడటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. వాయిదాని ముందే ఊహించి కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9 రావడం వల్ల లక్కీగా గట్టెక్కింది కానీ ఆ అదృష్టం అందరికీ ప్రతిసారి దక్కదుగా. ఇలాంటి ఇష్యూస్ లో నిర్మాత నాగవంశీ ప్లానింగ్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లెనిన్ సైతం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చినదే.

ఇది వ్యాపారం, ఎవరికి వచ్చింది వాళ్ళు అమ్ముకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఓటిటి ప్రభావం, ఎంటర్ టైన్మెంట్ చాలా ఖరీదుగా మారిపోయిన ట్రెండ్ లో ఇష్టం వచ్చినట్టు రిలీజ్ డేట్లు వేసుకోవడం సులువే కానీ వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ వస్తుదేనని ముందే గుర్తించకపోవడం రాంగే. ధీరజ్ ఇన్ డైరెక్ట్ గా చెబుతున్న సారం కూడా ఇదే. నిర్మాతలంతా ఒకటేనని అంటూనే తమలాంటి వాళ్లకు స్పేస్ ఇవ్వమని కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu