Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలాపూర్ లడ్డూ.. 39 లక్షలు.. ఆ డబ్బు ఏం చేస్తారు?

బాలాపూర్ లడ్డూ.. 39 లక్షలు.. ఆ డబ్బు ఏం చేస్తారు?

Gulte.com 2 days ago

హైదరాబాద్‌లోని గణపతి ఉత్సవాల్లో బాలాపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ గణపతి ఉత్సవాల్లో ఉంచే లడ్డూ ప్రసాదం వేలానికి మరింత ప్రాధాన్యం ఉంది.

దీనిని తాజాగా 39 లక్షల రూపాయలకు అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి వేలంలో పాడి సొంతం చేసుకున్నారు. ఇక్కడే కాదు.. పలు అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన మండపాల్లోనూ గణపతి లడ్డూలను పలువురు వేలంలో దక్కించుకున్నారు. అయితే.. ఇలా వేలంలో పాడిన సొమ్మును ఏం చేస్తారు? అనేది బిగ్ డౌట్‌.

వాస్తవానికి వినాయక చవితి పందిళ్లలో ప్రసాదంగా ఉంచే లడ్డూను తయారు చేయడమే ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిని సాధారణ లడ్డూలకు భిన్నంగా రూపొందిస్తారు. భారీగా డ్రైఫ్రూట్స్‌ను వినియోగించడంతోపాటు.. కొన్నాళ్లపాటు నిల్వ ఉన్నా కూడా.. పాడుకాని విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో లడ్డూ ధరలే లక్ష రూపాయలు పైచిలుకుగా ఉంటున్నాయి. ఉదాహరణకు 10 కేజీల నుంచి ప్రారంభమయ్యే గణపతి లడ్డూ తయారీకి.. 40 వేల నుంచి 60 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. దీంతో దానిని లక్ష రూపాయల వరకు విక్రయిస్తారు.

ఇక, ఉత్సవాల స్థాయి.. విగ్రహం సైజును బట్టి.. లడ్డూల సైజు ఆధారపడి ఉంటోంది. ఒక్కొక్క లడ్డూ తయారీకి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతోంది. తాజాగా బాలాపూర్ లడ్డూను 32 కిలోల శనగపిండి.. 10 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 22 కిలోల జీడిపప్పుతోపాటు.. 12 కేజీల స్వచ్ఛమైన నెయ్యితో 5 రోజుల పాటు కష్టపడి రూపొందించారు. దీనికి గాను దళసరి గిన్నెను కూడా కొనుగోలుచేశారు. మొత్తంగా తయారీకి 6 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని అంటున్నారు.

ఏం చేస్తారు?

వేలం పాడుకున్న వ్యక్తి నుంచి సగం సొమ్మును మండపంలోనే తీసుకుంటారు. ఒకవేళ మొత్తం అక్కడే కట్టినాఓకే. ఒకవేళ అంత సొమ్మును అక్కడికక్కడ కట్టలేక పోతే.. వాయిదాల రూపంలో మూడుసార్లు కట్టేలా ఒప్పందం రాయించుకుంటారు. అనంతరం.. ఈ సొమ్మును సేవా కార్యక్రమాలకు, అనాథ ఆశ్రమాల్లో మౌలిక వసతుల కల్పనకు వాడతారు. అలాగే, వచ్చే ఏడాది నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు కొంత సొమ్మును డిపాజిట్ చేస్తారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న చిన్నపాటి ఆలయాలకు విరాళాల రూపంలోనూ ఇస్తారు. ఇక, అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించే వేలం ద్వారా వచ్చే సొమ్మును అపార్ట్ మెంటు కమ్యూనిటీ ఖాతాలో జమ చేస్తారు. తద్వారా.. అవసరమైన ప్పుడు ఈ సొమ్మును వినియోగిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu